తదుపరి వార్తా కథనం
Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 05, 2024
07:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇటీవల ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
అక్టోబర్ 29న ముసాయిదా జాబితాను విడుదల చేసి,నవంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని,జనవరి 6న తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3.33కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని,ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
వీటిలో 2.45 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తయిందని, ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేయడం 60% పూర్తయిందని ఆయన తెలిపారు.