
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (బీఎస్ఈ) 10వ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్‌ఎస్‌సీ ఫలితాలను ప్రకటించారు.
ఫలితాలను అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in తోపాటు results.bse.telangana.gov.in, resuts.bsetelangana.orgలో కూడా చూడవచ్చు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి సబ్జెక్టులో 35 శాతం, ఓవరాల్‌గా 35 శాతం సాధించిన వారు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు.
ఫలితాలు
10వ ఫలితాలను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
1.అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలో లాగిన అవ్వండి.
2. కనిపించిన హోమ్‌పేజీలో TS SSC results 2023పై క్లిక్ చేయండి.
3. లాగిన్ పేజీలో మీ TS SSC హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.
4. ఆ తర్వాత రిజల్స్ట్ డిస్ ప్లే అవుతుంది.
5. మార్క్సుల మెమోను ఒకసారి చూసుకొని డౌన్‌లోడ్ చేయండి.
6. ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.