Page Loader
తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్

తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 25, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. ఉదయం పూట విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలని భావించిన సర్కారు, ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనుంది. దసరా కానుకగా రాష్ట్రంలోని 28 వేలకుపైగా బడులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఫలితంగా 23,05,801 (23 లక్షల) మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం పథకాన్ని వచ్చే నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా మోడల్‌ స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్‌ పాఠశాల్లోనూ అమలుకు విద్యాశాఖ సయామత్తమవుతోంది. సుపోషణలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు కానుంది.సన్నబియ్యం, రాగిజావ, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు/అరటిపండు లాంటి ఆహారాలను అందించబోతున్నారు.

DETAILS

ప్రతిరోజూ ఓ ప్రత్యేక మెనూ సిద్ధం

సోమవారం : గోధుమ రవ్వ ఉప్మాతో పాటు చట్నీ మంగళవారం : బియ్యం రవ్వ కిచిడితో కూడిన చట్నీ బుధవారం : బాంబే రవ్వ ఉప్మాతో పాటు సాంబర్ గురువారం : రవ్వ పొంగల్, సాంబార్ శుక్రవారం : మిల్లెట్ రవ్వ కిచిడీ, సాంబార్ శనివారం : గోధుమ రవ్వ కిచిడీ, సాంబార్ ను అందజేయనున్నారు. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచటం, కూలి పనుల చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. 'ముఖ్యమంత్రి అల్పాహార' పథకంలో భాగంగా 10వ తరగతిలోపు పాఠశాలల విద్యార్థులందరికీ బ్రేక్‌ ఫాస్ట్‌ను అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు సైతం మెరుగుపడే అవకాశాలున్నట్లు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దసరా నుంచి బడి పిల్లలకు సీఎం బ్రేక్‌ఫాస్ట్‌