Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌లో రైతులు ఇబ్బంది పడకుండా, రైతుబంధు (Rythu Bandhu) నిధులు విడుదలు చేయాలని సంబంధిత అధికారులను సీఎం అదేశించారు. ఫలితంగా మంగళవారం నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. సీఎం నిర్ణయంతో సుమారు 70లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి యాసంగి రైతు బంధు నిధులు.. నవంబర్ చివరి వారంలోనే జమ కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.