Telangana- Congress leader-Murder: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దారుణం..నాయకుడిని గొంతుకోసి హత్య చేసిన దుండగుడు
పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణ(Telangana) లో దారుణం చోటుచేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ఉన్న కాంగ్రెస్(Congress) నాయకుడిని గుర్తుతెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో హసన్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభను శనివారం నిర్వహించారు. రాత్రి ప్రచార సభ ముగుస్తుంది అనగాఓ వ్యక్తి పరుగున వచ్చి అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతపై కత్తితో గొంతు కోసి పారిపోయాడు. దీంతో పోలీసులు సదరు కాంగ్రెస్ నేతను హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.