తదుపరి వార్తా కథనం

Telangana: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 06, 2024
05:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల తుది 'కీ' విడుదలైంది.
ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తర్వాత, అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజా తుది కీని విడుదల చేశారు.
Telangana DSC తుది కీని స్కూల్ అసిస్టెంట్,లాంగ్వేజ్ పండిట్,సెకెండరీ గ్రేడ్ టీచర్,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ తుది కీ ద్వారా అభ్యర్థులు తమ పరీక్షల మార్కులను తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
జులై 18 నుండి ఆగస్టు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి.ఈ పరీక్షలకు 2,45,263మంది హాజరయ్యారు.