Page Loader
Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 
మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. నవంబర్ 7నుంచి ఎన్నికల నిర్వహణ ప్రారంభం అవుతుందని ఈసీ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి.. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. తెలంగాణ పోలింగ్ తేదీ: నవంబర్ 30, 2023 ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ: నవంబర్ 7, 2023 రెండో దశ : నవంబర్ 17, 2023 రాజస్థాన్‌ పోలింగ్ తేదీ నవంబర్ 23, 2023 మధ్యప్రదేశ్‌ పోలింగ్ తేదీ: నవంబర్ 17, 2023 మిజోరం పోలింగ్ తేదీ: నవంబర్ 7, 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

ఎన్నికలు

తెలంగాణ ఎన్నికల ముఖ్యమైన తేదీలు ఇవే.. 

తెలంగాణ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 5 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ - నవంబర్ 3, 2023 (శుక్రవారం) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - నవంబర్ 10 (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన తేదీ - నవంబర్ 13 (సోమవారం) అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ - నవంబర్ 15 (బుధవారం) పోలింగ్ తేదీ - నవంబర్ 30 (గురువారం) కౌంటింగ్ తేదీ - డిసెంబర్ 3 (ఆదివారం) ఎన్నిక ప్రక్రియ పూర్తి - డిసెంబర్ 5 (మంగళవారం)

ఎన్నికలు

60.2 లక్షల మంది కొత్త ఓటర్లు : సీఈసీ

ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సహా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 60.2 లక్షల మంది మొదటి సారి ఓటు వేయబోతున్నట్లు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో కలిసి 8.2 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఐదు రాష్ట్రాలలో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేర్కొన్నారు. పారదర్శకతను పెంచడానికి, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి 1.01 లక్షల బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

ఎన్నికలు

cVIGIL యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు: సీఈసీ

ఈ సారి అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో పోలింగ్ జరిగేలా చేసేందుకు ఈసీ చర్యలు తీసుకుంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేలా రోల్-టు-పోల్ మార్పిడిపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ రాష్ట్రాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించారు. పోలీసులు, ఎక్సైజ్, ఫారెస్ట్ ఏజెన్సీలతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులను చేయడానికి cVIGIL యాప్‌ను ఉపయోగించవచ్చని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు.