Page Loader
Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా
Telangana Elections : తెలంగాణలో పటిష్ఠ ఏర్పాట్లు.. ఎన్నివేల ఈవీఎంలు వినియోగిస్తున్నారో తెలుసా

Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎన్నికల సమరం చివర దశకు చేరుకుంటోంది. మరో 4 రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల సంఘం, పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్‌రాజ్‌ తెలిపారు. 6 అసెంబ్లీ సెగ్మంట్లలో 5 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు 36 వేల ఈవీఎం(EVM)లు రెఢీ చేసినట్లు వివరించారు. 60 మందిని ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించామన్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రానికి ఒక పరిశీలకుడు ఉంటారన్న వికాస్ రాజ్, సర్వీస్ ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.

details

ఆ ఓటర్లు ఈసారి 9.9 లక్షల మంది ఉన్నారు : ఈసీ

3 కేటగిరీల వారికి హోం ఓటింగ్‌ అవకాశం సైతం కల్పించామని, 9 వేల మందికిపైగా ఓటర్లు ఇదివరకే హోమ్ ఓటింగ్‌'లో పాల్గొన్నట్లు తెలిపారు. కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్‌ చేసి పోస్టల్ శాఖ ద్వారా పంపామన్నారు. 86 శాతం మేర ఓటర్ స్లిప్పుల పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 9.9లక్షల మంది ఉన్నారని సీఈసీ ప్రకటించారు.పోలింగ్‌ కేంద్రంలోనే ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వికాస్ రాజ్ అన్నారు. అయితే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోందన్నారు. మరోవైపు రాజధానిలో హైదరాబాద్'లో పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సందీప్‌ శాండిల్య అన్నారు.

DETAILS

పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి నిఘా : ఈసీ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరిస్తామని సీపీ చెప్పుకొచ్చారు. ఇందుకోసం 391 రూట్‌ మొబైల్స్, 129 గస్తీ వాహనాలు, 220 బ్లూకోల్ట్స్‌, అదనంగా 122 వాహనాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో రూట్‌ మొబైల్‌లో 3 సాయుధ బలగాలు, ఓ కానిస్టేబుల్, 45 ఫ్లయింగ్‌ స్క్వాడ్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు వివరించారు. మ హైదరాబాద్ పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్ సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతికత సాయంతో నిఘా పెట్టామని, పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్ ఉంటుందన్నారు. EVMలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందన్నారు.