
Telangana Elections : ఈసారి పోలింగ్ శాతం తక్కువేనట..3న తొలి ఫలితం అప్పుడే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విడుదల చేశారు.
ఈసారి రాష్ట్రంలో 70.74 శాతం నమోదైంది. 2018 ముందస్తు ఎన్నికలతో పోల్చితే ఈసారి 3 శాతం పోలింగ్ తగ్గినట్లు ప్రకటించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రిపోలింగ్'కు అవకాశం లేదని సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పోలింగ్ జరిగిందన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.05 పోలింగ్ శాతం నమోదైందన్నారు. ఇక హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురలో అత్యల్పంగా 36.9 పోలింగ్ శాతం రికార్డు అయ్యిందన్నారు.
ఓట్ ఫ్రమ్ హోమ్ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80ఏళ్ల పైబడిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించామన్నారు.
Details
యాదాద్రి జిల్లాలో అత్యధికం, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పం
తెలంగాణలో 70.74 శాతం పోలింగ్ నమోదు
డిసెంబర్ 3న 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
2018తో పోల్చితే తగ్గిన 3 శాతం పోలింగ్
అత్యధికంగా మునుగోడులో 91.05 శాతం పోలింగ్ నమోదు.
యాకుత్ పురలో అత్యల్పంగా 36.9 శాతం
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసిన లక్షా 80 వేల మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ శాతం
హైదరాబాద్‌లోనే అత్యల్పంగా 46.56 శాతం
ఈసారి ఓటర్లలో 18, 19 ఏళ్ల వయసున్న వారు 3.06 శాతం
డిసెంబర్ 3న ఉదయం 8.00 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలు
10.30 గంటలకి తొలి ఫలితం