Page Loader
Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  
భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు

Telangana Elections : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు షురు.. భద్రతా నీడలో స్ట్రాంగ్ రూములు  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 01, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కీలకమైన ఎన్నికల పోలింగ్‌ దశ ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈనెల ఆదివారం 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సెంటర్లను సిద్ధం చేశారు.హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు.ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించట్లేదు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Details

రాజధానిలో ఎన్నెన్ని టేబుళ్లు అంటే.. 

మరోవైపు అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రెఢీ అవుతున్నాయి. 10 నియోజకవర్గాలు మినహా ఒక్కో చోట 14+1 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటవుతున్నాయి. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్‌ కేంద్రాలుండటంతో 20+1 టేబుళ్లు రెఢీ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌,ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్‌ తదితర 6 నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.ఇక్కడ 28+1 టేబుళ్లు సిద్ధమవుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఈసారి ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వెల్లడించింది. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవ్వాలని యోచిస్తోంది. ఇందుకు 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి.