Page Loader
Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే
తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే

Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..  ఎక్కడెక్కడ ఎంతెంత శాతమంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది.అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓట్ల పండగ ప్రశాంతంగా సాగింది. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసిపోయింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. అయితే 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పలు చోట్ల చివరి నిమిషంలో పోలింగ్‌ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. మరోవైపు నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది.ఉదయం నుంచి అంతంతమాత్రంగానే సాగిన పోలింగ్‌ సాయంత్రం అనూహ్యంగా జోరందుకుంది. మెదక్‌ జిల్లాలో అత్యధిక పోలింగ్‌ శాతం ఉండగా,హైదరాబాద్‌లోనే అత్యల్పంగా రికార్డైంది.

DETAILS

మొత్తం 119 స్థానాలకు 2,290 మంది అభ్యర్థులు పోటీ

డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న వెల్లడికానుంది. అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు మినహా మిగతా ఎన్నికలు అంతా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం నిరాశజనకంగా మారింది. 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. 119లో 118లో కాంగ్రెస్‌, పొత్తులో ఒక చోట సీపీఐ పోటీ చేసింది. 111 చోట్ల బీజేపీ, పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 19 నియోజకవర్గాల్లో సీపీఎం పోటీ చేసింది. 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది. ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అతి తక్కువగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేశారు.

details

రాష్ట్రవ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ శాతం నమోదు

జిల్లా శాతం ఆదిలాబాద్ 73.58 శాతం భద్రాద్రి 66.37 శాతం హనుమకొండ 62.46 శాతం హైదరాబాద్ 39.97 శాతం జగిత్యాల 74.87 జనగాం 80.23 భూపాలపల్లి 76.10 గద్వాల్ 73.60 కామరెడ్డి 71.00 కరీంనగర్ 69.22 ఖమ్మం 73.77 ఆసిఫాబాద్ 71.63 మహబూబాబాద్ 77.50 మహబూబ్ నగర్ 73.70 మంచిర్యాల 70.71 మెదక్ 80.28 మేడ్చల్ 49.25 ములుగు 75.02 నాగర్ కర్నూల్ 70.83 నల్గొండ 75.72 నారాయణపేట 67.70 నిర్మల్ 71.47 నిజామాబాద్ 68.30 పెద్దపల్లి 69.83 సిరిసిల్ల 71.87 రంగారెడ్డి 53.03 సంగారెడ్డి 73.83 సిద్దిపేట 77.19 సూర్యాపేట 74.88 వికారాబాద్ 69.79 వనపర్తి 72.60 వరంగల్ 73.04 యాదద్రి 78.31 శాతం పోలింగ్ నమోదైంది.