Page Loader
Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా
కొడంగల్'లో కుటుంబసమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా

Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ZPHS బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో కుటుంబ సమేతంగా హాజరైన రేవంత్, ఓటు వేశారు. అంతకుముందు ఓటు వేసే ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి గలవారన్నారు. సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరకాలంటే ప్రజలకు నచ్చిన ప్రభుత్వం రావాలన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య నీటి సమస్యలను సైతం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. స్పష్టం చేశారు. ఎలాంటి కుట్రలకు లొంగిపోవద్దని తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్ రెడ్డి