
CM Revanth Reddy: ముచ్చెర్లను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్లను భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా ముచ్చెర్ల అవతరించనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. ముచ్చెర్ల ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు.
ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు, నైపుణ్యాలు, క్రీడలకు భవిష్యత్తు నగరం కేంద్రంగా ఉంటుందన్నారు.
Details
స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం
యువతకు ఉద్యోగ నైపుణ్యాలను అందించేందుకు ముచ్చెర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీని ప్లాన్ చేస్తున్నామన్నారు.
స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్ టూరిజం హబ్ కూడా ఉంటుందన్నారు.
పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ఇంకా 10 నెలలు కూడా పూర్తి చేయని ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు.
హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్‌ను అప్పట్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి కొంత మందికి లబ్ధి చేకూర్చిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.