NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న 
    తదుపరి వార్తా కథనం
    Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న 
    ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న vv

    Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 22, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మద్యం మత్తులో కుమారుడ్ని ఓ తండ్రి కత్తితో పొడిచిన హృదయవిదారక ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

    కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాకి చెందిన వసంతరావు -సరస్వతి దంపతుల కుమారుడు సురేష్(22) ఐదు నెలల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లి స్వగ్రానికి తిరిగి వచ్చాడు.

    అప్పట్నుంచి హైదరాబాద్'కు వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవినం సాగిస్తున్నాడు. రెండు రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామం గుజ్జుల్'కు సురేష్ వచ్చాడు.

    గల్ఫ్'లో ఉన్నప్పుడు డబ్బులు పంపిన విషయంలో తల్లి సరస్వతితో తండ్రి వసంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే కుమారుడు సురేష్ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడాడు.

    DETAILS

    కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి బలవన్మరణం

    దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి వసంతరావు(45) కత్తితో కుమారుడు సురేష్(22)పై చాతి, మెడ వీపు భాగంలో దాడి చేయగా సురేష్'కు తీవ్ర రక్తస్రావమైంది.

    గమనించిన స్థానికులు హుటాహుటిన గాంధారి మండల కేంద్రంలోని ప్రైవేట్ దవాఖనాకు హుటాహుటిన తరలించారు.అప్పటికే సురేష్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

    మద్యం మత్తులో ఉన్న తండ్రి వసంతరావు కుమారుడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

    గమనించిన కుటుంబీకులు వసంతరావును చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తండ్రి వసంతరావు మృతి చెందాడు.

    తండ్రి, కొడుకు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బాధితురాలు సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్

    హైదరాబాద్

    హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్  దుబాయ్
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   అమిత్ షా
    Telangana Election: ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ రిపోర్టు.. సాయంత్రానికి హైదరాబాద్‌ నూతన సీపీ ఖరారు! ఎన్నికల సంఘం
    Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్  అసదుద్దీన్ ఒవైసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025