Page Loader
TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 01, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న అంగన్‌వాడీలకు సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వారిపై వరాల జల్లును కురిపించింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీని అంగన్‌వాడీలకు వర్తింపజేయాలని భావించింది. ఈ క్రమంలోనే త్వరలో ప్రకటించనున్న పీఆర్సీేలో అంగన్‌వాడీలనూ చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులనూ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

DETAILS

70 వేల మంది అంగన్‌వాడీలకు లబ్ధి

తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 70 వేేల మంది అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో ఆదివారం భేటీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటే అంగన్‌వాడీల జీతాలు భారీగా పెంచుతామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అంగన్‌వాడీ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.