Warangal: హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించి వరాల జల్లు కురిపించింది. దీంతో వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజా పాలన మొదటి ఏడాది విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ వరంగల్ మహానగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 4962.47 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో వివిధ విభాగాల్లో చేపట్టనున్న పనులకు అనుమతులు మంజూరు చేయడంతోపాటు అనేక ఉత్తర్వులను జారీ చేసింది.
వరంగల్ అభివృద్ధి ప్రాజెక్టులు, కేటాయింపు వివరాలు
వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ: రూ. 4,170 కోట్లు. మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ: రూ. 205 కోట్లు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్: రూ. 160.92 కోట్లు. పార్క్‌లో రోడ్లు, స్కూల్స్, ఇతర సదుపాయాల కోసం రూ. 33.60 కోట్లు. భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్లు, రూ. 43.15 కోట్ల పరిహారం. కాళోజీ కళాక్షేత్రం: రూ. 85 కోట్లు. పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట రోడ్డు విస్తరణ: రూ. 65 కోట్లు. నయీమ్‌నగర్ బ్రిడ్జి నిర్మాణం: రూ. 8.3 కోట్లు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం నిర్మాణం: రూ. 32.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం: రూ. 80 కోట్లు.
ప్రాజెక్టుల ద్వారా వరంగల్ మహానగరం సుస్థిరమైన అభివృద్ధి
భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం: రూ. 28 కోట్లు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధి: రూ. 49.50 కోట్లు. ఉర్దూ భవన్, షాదీ ఖానా నిర్మాణం: రూ. 1.50 కోట్లు. ఈ ప్రాజెక్టుల ద్వారా వరంగల్ మహానగరం సుస్థిరమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్లనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు నగర ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.