
Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బంఫర్ అఫర్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇస్తే చాలు, రూ. లక్ష నగదు గెలవచ్చని కీలక ప్రకటన చేశారు.
ఐడియా థాన్ పేరుతో స్మితా సబర్వాల్ 'ఎక్స్' వేదికగా ఈ ప్రకటన షేర్ చేశారు.
రాష్ట్రంలో అర్బన్, రూరల్ స్థానిక సంస్థల ఆదాయం పెంచడానికి ఇన్నోవేటివ్ ఐడియాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
Details
గూగుల్ డాక్స్ లింక్‌ను షేర్ చేసిన స్మితా సబర్వాల్
ఇక ఐడియాలు ఇవ్వడానికి గూగుల్ డాక్స్ లింక్‌ను కూడా ఆమె షేర్ చేశారు.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌కు ఈ దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందన్నారు.
దీనిపై మరింత సమాచారం తెలియాలంటే tgsfc@gmail.com ను సంప్రదించాలని ఆమె సూచించారు.
గూగుల్ డాక్స్ ఫామ్ లో ఈమెయిల్, ఫోన్ నెంబర్, పూర్తి పేరు, వయస్సు, అడ్రస్ ఉండాలన్నారు.
200 నుంచి 300 పదాలలో ఆదాయం పెంచేందుకు ఐడియాను సబ్మిట్ చేయాలన్నారు.