
LRS SUBSIDY: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ - ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రాయితీ గడువును పొడిగించింది.
ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పొడిగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ, ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన రాలేదు.
రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరింత మంది లబ్ధి పొందేలా ప్రభుత్వం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు
#MAUD #LRS 2020 - Extension of time for availment of rebate upto 30-04-2025 pic.twitter.com/J9g2Dw4IYa
— Jacob Ross (@JacobBhoompag) April 2, 2025