
Telangana Election : ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ను పురస్కరించుకుని ఈనెల 30న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవుగా కార్మిక శాఖ వెల్లడించింది.
తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇదే సమయంలో పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.
ప్రజా ప్రతినిధుల చట్టం కింద కర్మాగారాలు, సంస్థల చట్టం-1974, తెలంగాణ దుకాణ సముదాయాల చట్టం-1988 పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని వివరించింది.
ఈ నేపథ్యంలోనేే కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.
details
పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు
ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కార్మికశాఖ స్పష్టం చేసింది.
బడులకు రెండు రోజుల పాటు సెలవులే :
ఇదే సమయంలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లకు వరుసగా రెండు రోజులు సెలవును ప్రభుత్వం ప్రకటించింది. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్రంలోని 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యారు.
పోలింగ్ కేంద్రాలైన ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల సిబ్బంది ముందు రోజు మధ్నాహ్నం నుంచే చేరుకుంటారు.
ఈ క్రమంలోనే ఎన్నికల విధులకు అనుకూలంగా రెండు రోజులు సెలవులు మంజూరు చేశారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.