Page Loader
TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్
తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్

TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. టాప్ వన్‌లో మహిళా అభ్యర్థి ఈసారి గ్రూప్-1లో టాప్ స్కోర్ 550గా నమోదైంది. మహిళా అభ్యర్థి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య 52గా ఉంది.

Details

రీ కౌంటింగ్‌కు అవకాశం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతుండటంతో గ్రూప్-1 ఫలితాలపై భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కమిషన్ 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది. 10వ తేదీన అభ్యర్థుల మార్కులను వారి లాగిన్ ఐడీలకు టీజీపీఎస్సీ పంపించింది. అభ్యర్థులకు వచ్చిన మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పించింది. రీ కౌంటింగ్‌కు ఈ నెల 24 వరకు గడువు ఇచ్చింది. రీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ ఫలితాలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆనందాన్ని, కొందరికి నిరాశను మిగిల్చింది.