TG Group1 Results: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు నేడే విడుదల.. ఇంటర్వ్యూకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది.
గ్రూప్-1 ఫలితాలను సోమవారం విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను ఈ రోజు కమిషన్ ప్రకటించనుంది.
మరోవైపు మంగళవారం గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను టీజీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Details
రీకౌంటింగ్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా గ్రూప్-1 ఫలితాలను ప్రకటించిన తర్వాత, అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
రీకౌంటింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత, 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు సాధించిన మార్కులను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత నిర్వహించిన మొదటి గ్రూప్-1 నియామకాలు కావడంతో నిరుద్యోగ యువత ఆశతో ఎదురుచూస్తున్నారు.
Details
గ్రూప్-1 పరీక్షల సమగ్ర వివరాలు
563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది అంచనుకు వచ్చింది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది పోటీపడుతున్నారు.
గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత, గ్రూప్-2, తర్వాత గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
Details
రీకౌంటింగ్‌కు అవకాశం
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.
అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టువారీగా మార్కులను పరిశీలించవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలున్నవారికి రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తారు.
1:2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితా తర్వాత 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Details
గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల అప్‌డేట్
ఇప్పటికే గ్రూప్-2, గ్రూప్-3 ప్రాథమిక కీలు విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది.
వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సిద్ధం చేసేందుకు టీజీపీఎస్సీ వేగంగా పనిచేస్తోంది.
ప్రాధాన్యత క్రమంలో నియామక ప్రక్రియను పూర్తి చేస్తే బ్యాక్‌లాగ్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
మొత్తంగా ఈ నెలాఖరులోగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశముంది.