LOADING...
TGPSC Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే!
తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే!

TGPSC Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించగా, 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు పేపర్లుగా పరీక్ష జరిగింది. పేపర్-1కి, 2,57,981 మంది, పేపర్-2కి 2,55,490 మంది, పేపర్-3కి 2,51,738 మంది, పేపర్-4కి 2,51,486 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలతో అభ్యర్థుల ర్యాంకులు వెల్లడించబడిన నేపథ్యంలో ఎంపికకు సంబంధించి తదుపరి ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది.