Page Loader
వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు
అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమని అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు

వ్రాసిన వారు Stalin
Mar 17, 2023
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని, తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ నిర్వహించాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. న్యాయవాదిని విచారణ ప్రాంతంలోకి అనుమతించరాదని, అయితే విచారణలో సమయంలో దూరంగా కనిపించవచ్చని అవినాష్‌రెడ్డికి సూచించారు.

వైఎస్ వివేకా

అవినాష్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివేకా హత్య కేసు

తనపై సీబీఐ బలవంతపు చర్యలు తీసుకోకుండా నిరోధించాలని, విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుండటంతో కేసు సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ సాదాసీదాగా సాగిన విచారణ ఇప్పుడు అవినాష్ రెడ్డి కుటుంబం చుట్టూ తిరుగుతోంది.