
వైఎస్ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలోని ధర్మానసం బెయిల్ పిటిషన్‌ను విచారించింది.
వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.
దేశం విడిచి వెళ్లవద్దని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని, ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలని అవినాష్‌రెడ్డికి కోర్టు షరతులు విధించింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వివేకా 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అవినాష్
రెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షరతులతో కూడిన బెయిల్ మంజూరు
Telangana High Court grants anticipatory bail with certain conditions for MP Avinash Reddy#YSVivekaCase
— MIRCHI9 (@Mirchi9) May 31, 2023