Telangana High Court: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై స్పందించిన తెలంగాణ హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది.
న్యాయమూర్తులు అలోక్ ఆరాధే, ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం హరిరామ జోగయ్య తన అప్పీల్‌ను పిల్‌గా పరిగణించాలని దాఖలు చేసిన సవరణలను పరిగణలోకి తీసుకుంది.
దీనిని పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిగింది.
PILకు సవరణలను పరిశీలించిన హైకోర్టు హరిరామ జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది.
Details
అఫిడవిట్‌ను సవరించడానికి రెండు వారాల సమయం
హైకోర్టు ధర్మాసనం దీనిని పిల్‌గా పరిగణించడానికి అంగీకరించింది. హరిరామ జోగయ్య పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఆ తర్వాత ప్రతివాదులుగా ఉన్న వైఎస్ జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జూన్‌లో, హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల (డిఎ) కేసు విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌లో ప్రజా ప్రయోజనం లేదని హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజాగా, అఫిడవిట్‌ను సవరించాలని మాజీ ఎంపీని ఆదేశించిన హైకోర్టు.. దీనికి సంబంధించి రెండు వారాల సమయం ఇచ్చింది.