Loading...
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్‌లో రూ.3.50 లక్షలకే ఫ్లాట్‌.. ప్రభుత్వం నిర్ణయం
ఇందిరమ్మ టవర్స్‌లో రూ.3.50 లక్షలకే ఫ్లాట్‌.. ప్రభుత్వం నిర్ణయం

Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్‌లో రూ.3.50 లక్షలకే ఫ్లాట్‌.. ప్రభుత్వం నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకంలో భాగంగా క్యూర్‌ పరిధిని మినహాయించి మిగతా కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లను లబ్ధిదారులకు రూ.3.50 లక్షలకే అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందించింది. ఫ్లాట్‌ కేటాయింపు సమయంలో రూ.50 వేలు, ఆ తర్వాత ఆర్‌సీసీ నిర్మాణం, ఫినిషింగ్‌ పనుల దశల్లో రూ.లక్ష చొప్పున చెల్లించాలి. మిగిలిన రూ.లక్షను కేటాయింపు ప్రక్రియలో నిర్దేశించిన మరో విడతలో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వివరాలు 

ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున ఇందిరమ్మ టవర్స్

మొదటి విడతలో ఐదు ప్రాంతాల్లో మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నిజామాబాద్‌ జిల్లా నాగారం పరిధిలోని ఆర్‌జీకే కాలనీ, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట, కాజీపేట మండలం మడికొండ, నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడ పరిధిలోని డీవీకే రోడ్డు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బండమీదిపల్లిలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించనున్నారు.

వివరాలు 

నిబంధనలు, విచారణ ఇలా..

క్యూర్‌ పరిధిలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో నిర్మించే ఇందిరమ్మ టవర్స్‌కు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. -

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో లబ్ధిదారులు ఆధార్‌ నంబరు సమర్పిస్తే సరిపోతుంది.

సంబంధిత పురపాలక కార్పొరేషన్‌ను ఒక యూనిట్‌గా పరిగణించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ కార్పొరేషన్‌ పరిధిలో నివసించే అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజీ) ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ సేవా కేంద్రాల ద్వారా రూ.100 రుసుం చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.

టోకెన్‌ అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లించాలి. ఒకవేళ ఫ్లాట్‌ కేటాయింపు జరగకపోతే ఆ మొత్తాన్ని తిరిగి అందిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

నిబంధనలు, విచారణ ఇలా..

ఒక్కో ఫ్లాట్‌ను 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.

ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. అన్‌డివైడెడ్‌ షేర్‌ (యూడీఎస్‌) కింద స్థలం కూడా ఉచితంగా లభిస్తుంది.

దరఖాస్తుదారులకు సంబంధిత కార్పొరేషన్‌ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ప్లాటు ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి.

కేటాయించిన ఫ్లాట్‌ను పదేళ్లపాటు విక్రయించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతి ఉండదు. అయితే బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

నిబంధనలు, విచారణ ఇలా..

లబ్ధిదారుల ఎంపికకు 360 డిగ్రీల కోణంలో సమగ్ర విచారణ చేపడతారు. అనంతరం లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయిస్తారు. ఎంపికైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలిస్తారు.

- దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040-24603572 కాల్‌సెంటర్‌ నంబరును సంప్రదించవచ్చు.

వివరాలు 

రెండేళ్లలో మిగతా కార్పొరేషన్లలోనూ నిర్మాణాలు

తొలి విడతలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగతా కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల సహా పలు పురపాలక ప్రాంతాల్లో హౌసింగ్‌ బోర్డుకు చెందిన స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే అధికారులు ఆయా స్థలాల వివరాలను సేకరించారు. మరోవైపు క్యూర్‌ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మరో 4 వేల ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది.

మొత్తంగా రాబోయే రెండేళ్లలో ఇందిరమ్మ టవర్స్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు పెద్దఎత్తున ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ADVERTISEMENT