Inter Exams: మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు శ్రద్ధ పెట్టింది. మార్చి మొదటి వారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది. మార్చి 3వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షా షెడ్యూల్ రూపొందించేస్తున్నారని సమాచారం. మార్చి నెలాఖరున ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక, ఫిబ్రవరి తొలి వారం లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు
ఈ పరీక్షల షెడ్యూల్ కూడా సిద్ధమవుతోంది. ఆ సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడా త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే పనిలో ఉన్నారు.