తదుపరి వార్తా కథనం

తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Aug 18, 2023
05:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతోందని పేర్కొంది.
పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతున్న అల్పపీడనం కారణంగా వచ్చే 2 -3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా పయనించనుంది. ఈ మేరకు పశ్చిమ, వాయవ్య దిశల్లో గాలుల తెలంగాణలోకి వీస్తున్నట్లు వివరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుంది.
శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ సహా నిజామాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడనున్నాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరోసారి తెలంగాణలో భారీ వానలు
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 18, 2023