తెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరోసారి వర్షాలు హోరెత్తించనున్నాయి. వచ్చే 3 రోజులపాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటున సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ ప్రభావంతోనే వచ్చే 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది.ఈ మేరకు రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లోనే భారీ వర్షాలు : ఐఎండీ ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.