LOADING...
Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్
నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్

Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ పంచాయతీ ఎన్నికల-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలను పోలింగ్ రోజులుగా నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అంటేనే ఎన్నికల కోడ్‌ ఈరోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.

వివరాలు 

డిసెంబర్ 27వ తేదీ నుంచి తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

''సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాము.అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న షెడ్యూల్‌పై కోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో 1.66 కోట్లమంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 4,200 సర్పంచ్ పదవులు, 37,440 వార్డు సభ్య పదవులకు ఎన్నికలు జరుగుతాయి'' అని కమిషనర్ రాణి కుముదిని వివరించారు. డిసెంబర్ 27వ తేదీ గురువారం నుంచి తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రెండో విడతకు ఈ నెల 30వ తేదీ నుంచి,మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు,38,350 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల