Page Loader
Praja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం
శుక్రవారం ప్రజా దర్బార్

Praja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 08, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావ్ బా పూలే ప్రజా భవన్'లో ప్రజా దర్భార్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ జరుగుతుందని, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తామన్నారు. సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశిస్తున్నారు. కార్యక్రమానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు భరించారని,ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ప్రగతిభవన్‌ ఇనుప కంచెలను బద్దలు కొట్టించామని, ఇకపై ప్రతీ శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జ్యోతిరావు పూలే ప్రజాభావన్'లో ప్రజాదర్భార్