Page Loader
Kalwakuntla kannarao: కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు
కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు

Kalwakuntla kannarao: కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్టు

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూ వివాదం కేసులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు​ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఆదిభట్ల పోలీసులు కన్నారావును అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. అరెస్టుకన్నాముందే కన్నారావు రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం యత్నించారు. అయితే కన్నారావు బెయిల్ పిటిషన్​ను కోర్టు తిరస్కరించడంతో కన్నారావును అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండలం మన్నెగూడలోని ఓఆర్ఎస్ ప్రాజెక్టు సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేటు భూమిని ఆక్రమించుకునేందుకు కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందన్నఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఓఆర్ఎస్ ప్రాజెక్టు సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ మార్చి 26న ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కన్నారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Kannarao

భూభాగం చుట్టూ ఉన్న ఫెన్సింగ్​ను​ తొలగించారు

మార్చి 3న రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండలం మన్నెగూడలోని సర్వే నంబర్​ 32/ ఆర్​ యూయూలో ఓఆర్​ఎస్​ ప్రాజెక్టు సంస్థకు చెందిన భూభాగంలోకి కల్వకుంట్ల కన్నారావు తన అనుచరులతో చొరబడ్డారని బండోజు శ్రీనివాస్​ ఆదిభట్ల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కన్నారావు అనుచరులు తమ సంస్థకు చెందిన భూభాగం చుట్టూ ఉన్న ఫెన్సింగ్​ను తొలగించారు. ఆపై సరిహద్దు రాళ్లు వేసి భూమి చుట్టూ ఉన్న ఫ్రీకాస్ట్​ వాల్స్​ను కూడా కూల్చివేశారని అందులో తెలిపారు. ఈ భూవివాదం కేసులో కన్నారావుతో పాటు మరో 38 మంది పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.