Page Loader
Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు

Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ కేసును విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.

వివరాలు 

 రెండు కేసులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ 

ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. 90 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తు ద్వారా బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వివరాలు 

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలకపరిణామం చోటుచేసుకుంది.సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్,గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓటాక్‌షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. ఆ టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా,ప్రత్యేక ఎపిసోడ్‌లో ప్రభాస్,గోపీచంద్ కనిపించారు. ఈ కేసు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.పోలీసుల దర్యాప్తుతో త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.