Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో అల్పపీడనం ఏర్పడిందని, అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది.
వాతావరణం బుధవారం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది.
రానున్న 48 గంటల్లో ఇది వాయువ్య దిశగా పయనించి తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
డిసెంబర్ 1న గాలుల వేగం 60 నుంచి 80కి.మీల వరకు ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు..#Telangana #WeatherUpdate #Heavyrains #NTVNews #NTVTelugu pic.twitter.com/z6M2CZB8ut
— NTV Telugu (@NtvTeluguLive) November 29, 2023