Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ
వ్రాసిన వారు
Stalin
Dec 03, 2023
08:40 am
ఈ వార్తాకథనం ఏంటి
Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్, పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపడుతున్న కామారెడ్డి నియోజకవర్గంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ముందంజ ఉంటడం విశేషం. కామారెడ్డిలో మొదటి నుంచి వెంకటరమణారెడ్డిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ స్థానంలో ప్రధాని మోదీ కూడా ప్రచారం చేయడంతో స్థానిక పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి