LOADING...
CM Revanth Reddy: 'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక
'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక

CM Revanth Reddy: 'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర అభివృద్ధి పథకాలను సమగ్రంగా ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థికవ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లే రోడ్‌మ్యాప్ ఈ డాక్యుమెంట్‌లో ప్రతిఫలించాలన్నారు. అభివృద్ధిని మూడు ఆర్థిక జోన్లుగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) విభజించి ముందుకు సాగాలని సూచించారు. పాలసీ పెరాలసిస్‌కు రాష్ట్రంలో చోటు లేకుండా, వాస్తవిక దృక్పథం, ఆధునిక డిజైన్లు ప్రతిచోటా ప్రతిబింబించేలా డాక్యుమెంట్‌ను రూపొందించాలని సీఎం దిశానిర్దేశం ఇచ్చారు.

Details

డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 

విజన్ 2047 లక్ష్యాలను సాధించడానికి, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహించనుంది. నగరాన్ని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం ప్రధాన మైలురాయిగా నిలవనుంది.

Details

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష 

సమ్మిట్‌ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, సీతక్కతో పాటు సీఎస్ రామకృష్ణారావు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు లక్ష్యం తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు పరిచయం చేయడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల లభించే ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూపించడం. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోనే ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు కూడా ఈ సమ్మిట్‌లో వివరించబడనున్నాయి.

Advertisement

Details

తెలంగాణ రైజింగ్ విజన్ 2047 - కీలక లక్ష్యాలు 

రాష్ట్ర భవిష్యత్ ప్రయాణానికి దిశానిర్దేశం చేసే సమగ్ర విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. విజన్ 2047లో ప్రధానంగా కేంద్రీకరించిన అంశాలు సమాన వృద్ధి మహిళా సాధికారత యువ శక్తి వినియోగం సుస్థిర అభివృద్ధి చిన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. భారత రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్ వంటి ప్రముఖ దేశాలతో పోటీ పడే ఆర్థిక ఉద్దేశ్యాలతో ముందుకెళ్తోంది.

Advertisement

Details

ఆర్థిక వృద్ధికి కీలక రంగాలు 

ప్రభుత్వం గుర్తించిన ప్రధాన వృద్ధి రంగాలు ఫార్మాస్యూటికల్స్ లైఫ్ సైన్సెస్ ఏరోస్పేస్ క్వాంటమ్ టెక్నాలజీ కృత్రిమ మేధస్సు స్టార్టప్ ఎకోసిస్టమ్ MSMEలు టూరిజం ఎగుమతులు పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పెరుగుదల తెలంగాణను పెట్టుబడిదారులకు మొదటి ఎంపికగా నిలబెడతాయి. అభివృద్ధిలో సమతుల్యత కోసం హైదరాబాద్ కోర్ అర్బన్ జోన్, సెమీ అర్బన్ జోన్ మరియు గ్రామీణ తెలంగాణను మూడు వేర్వేరు అభివృద్ధి బ్లాకులుగా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే వ్యూహాలు కూడా విజన్ డాక్యుమెంట్‌లో కీలక భాగం కానున్నాయి.

Details

హిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతులు 

మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. పర్యావరణ రక్షణలో భాగంగా నెట్-జీరో తెలంగాణ లక్ష్యం బ్లూ & గ్రీన్ హైదరాబాద్ కాన్సెప్ట్ మూసీ నది పునరుజ్జీవనం 2959 చెరువుల పునరుద్ధరణ అటవీ, పార్కుల అభివృద్ధి గ్రామీణాభివృద్ధి కోసం Village 2.0 మోడల్ ద్వారా స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులు అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Details

రవాణా విస్తరణ, కొత్త విమానాశ్రయాలు, గ్లోబల్ వర్క్‌ఫోర్స్ 

రవాణా రంగంలో భారీ ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమానంగా రీజనల్ రింగ్ రోడ్ హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లు రీజనల్ రింగ్ రైలు 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు కొత్త విమానాశ్రయాలు వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం హైదరాబాద్-బందరు పోర్టు మధ్య అత్యాధునిక హైవే నిర్మాణం చేపట్టి సీపోర్ట్ అనుసంధానాన్ని బలోపేతం చేయనుంది. ప్రతి ఏడాది 2 లక్షల యువతకు, 1 లక్ష నిపుణులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇస్తూ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో తెలంగాణను ముందంజలో నిలపాలని లక్ష్యం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో స్పోర్ట్స్ విలేజ్‌లు, యువత హోలిస్టిక్ అభివృద్ధికి వెల్‌నెస్ సెంటర్లు నిర్మించనున్నారు.

Details

టూరిజం, సంస్కృతి, గ్లోబల్ బ్రాండ్ తెలంగాణ 

అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం: ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు హైదరాబాద్‌ను నైట్ ఎకానమీ సిటీగా తీర్చిదిద్దడం బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్‌ను గ్లోబల్ ఫెస్టివల్స్‌గా బ్రాండింగ్ చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. ప్రతి గ్రామం నుంచి గ్లోబల్ సిటీ హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధి విజన్-2047లో ప్రధాన మంత్రివాక్యాలుగా నిలవనున్నాయి.

Advertisement