
Mahalaxmi Scheme: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక మైలురాయిని అధిగమించింది.ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని ఆర్టీసీ తెలిపింది. ఈ ఉచిత ప్రయాణాల విలువ మొత్తంగా రూ.6,700 కోట్లుగా నమోదు అయినట్లు వెల్లడించింది. ఉచిత బస్సు సేవలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలలో, 341 బస్ స్టేషన్‌లలో వేడుకలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
వివరాలు
18 నెలలుగా ఉచిత బస్సు పథకం
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. రాష్ట్రంలోని మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా ఆర్టీసీ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలు బస్సుల్లో కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు. ఈ విధంగా సుమారు 18 నెలలుగా ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతూ వస్తోంది.