Page Loader
TGSRTC Discount: బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం
బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం

TGSRTC Discount: బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆర్టీసీ సంస్ధ బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీని టికెట్ ధరలపై మంజూరు చేసింది. ఈ డిస్కౌంట్ రాయితీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు రూట్‌లో వెళ్లే సర్వీసులపై ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రాయితీ వల్ల ప్రయాణికులు రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ని సందర్శించాలని ఆయన సూచించారు.

Details

టికెట్ ధరలు పాతవి, కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

సీ స్లీపర్ బస్సులో బెర్త్ పాత ధర: రూ.1569 డిస్కౌంట్ ధర: రూ.1412 ఏసీ స్లీపర్ సీటర్ పాత ధర: రూ.1203 డిస్కౌంట్ ధర: రూ.1083 రాజధాని బస్సులు పాత ధర: రూ.1203 డిస్కౌంట్ ధర: రూ.1083 NAC స్లీపర్ బెర్త్ పాత ధర: రూ.1160 డిస్కౌంట్ ధర: రూ.1044 NAC సీటర్ పాత ధర: రూ.951 డిస్కౌంట్ ధర: రూ.856 సూపర్ లగ్జరీ పాత ధర: రూ.946 డిస్కౌంట్ ధర: రూ.851 ఈ డిస్కౌంట్ ప్రయాణికులకు చాలా ఉపకారం అవుతుందని ఆర్టీసీ సంస్థ తెలిపింది.