NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే.. 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే.. 
    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..

    తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే.. 

    వ్రాసిన వారు Stalin
    Oct 21, 2023
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రజా ప్రతినిధుల నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించే ఏడీఆర్ శనివారం ఆసక్తికమైన నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎమ్మెల్యే నేరాలపై కీలక విషయాలను వెల్లడించింది.

    తెలంగాణలోని 118మంది ఎమ్మెల్యేల్లో 72మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 46మందిపై తీవ్రమైన క్రిమినల్‌ అభియోగాలు ఉన్నట్లు వెల్లడించింది.

    అధికార బీఆర్ఎస్‌కు చెందిన 101మంది ఎమ్మెల్యేలలో 59 మంది క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

    తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది స్థానాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఖాళీగా ఉంది.

    ఎమ్మెల్యే సాయన్న మృతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అందుకే 118 మందిపై సర్వే చేసినట్లు ఏడీఆర్ చెప్పింది.

    అసెంబ్లీ

    ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, ఒకరిపై అత్యాచారం కేసు

    2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు, ఆ తర్వాత నిర్వహించిన ఉప ఎన్నికల ఆధారంగా ఏడీఆర్ ఈ నేర విశ్లేషణ చేసింది.

    ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌లో చెప్పారు.

    నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్-376 కింద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు కావడం గమనార్హం.

    ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    ఎమ్మెల్యే

    తాజా

    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్

    తెలంగాణ

    Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే! బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ
    Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం  కేంద్ర ప్రభుత్వం
    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    తెలంగాణలో బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు.. ఎన్నికల కోసం సంస్థాగత కమిటీల ఏర్పాటు బండి సంజయ్

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం కర్ణాటక
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కాంగ్రెస్
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కర్ణాటక

    ఎమ్మెల్యే

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025