ACB Raids: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడ్డ ప్రభుత్వఅధికారిణి .. ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఘటన
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం తన కార్యాలయంలో రూ. 84,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ACB ప్రకారం..నిజామాబాద్‌లోని పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు, గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద జగజ్యోతి రూ.84,000 లంచం డిమాండ్ చేసింది. దీంతో గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఈ క్రమంలో జగ జ్యోతి కన్నీరు పెట్టుకుంది.