Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం గతంలో ఉద్యమించిన కేసీఆర్ , ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో వేడుకలకు హాజరు కానున్నారు.
వాహనాలపై టిజీ
ఈ సారి విశేషమేమంటే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని గుర్తించే కార్యక్రమాన్ని కోదండ రామ్ తీసుకున్నారు. వారిని సన్మానించనున్నారు. ఒంటెత్తు పోకడలు పోకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలను చేసిన వారి కుటుంబాలని తొలిసారిగా ఆహ్వానాలు పంపారు. ఉద్యమ సమయంలో వాహనాలపైన రాసినట్లు టిజీ అని రాసుకున్నారు. ఆ పేరుతోనే వాహనాలు ప్రస్తుతం రిజిస్టర్ చేస్తున్నారు.
ఉస్మానియా ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..
1969తొలిదశ ఉద్యమం మొదలు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు రణ రంగాన్ని తలపించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలు,ఉద్యమ సమయంలో ఆ నేలను తాకిన ప్రతి నెత్తుటి చుక్క సాక్షిగా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేసింది. ఆనాడు పోరాడిన ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితమేనాడు పోరాడిన ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కలలు కన్న స్వరాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కదనరంగంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఆ పోరు రాష్ట్రాన్ని సాధించే వరకు తన తీరు మార్చుకోలేదు. ఉద్యమమేదైనా పునాది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే.ఇక్కడే రాష్ట్రం సిద్ధించి దశాబ్ద కాలం అవుతుంది.