Page Loader
TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మార్చి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. సాధారణ స్థాయితో పోలిస్తే 3.3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. రాబోయే రెండు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా చేరే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు ప్రభావం చూపనున్నాయని, ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలియజేశారు.

వివరాలు 

శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు

శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరే అవకాశమున్న కారణంగా మరో ఏడు జిల్లాల్లో కూడా శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.