Page Loader
Tamil Nadu temples: 'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు
'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు

Tamil Nadu temples: 'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

'కోడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందువులు కాని వారిని అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు Hindu Religious and Charitable Endowments (HR&CE) శాఖను ఆదేశించింది. హిందూయేతరులు మతాతీత ప్రయోజనాల కోసం దేవాలయాల్లోకి ప్రవేశించారని ఆరోపించిన సంఘటనలను హైలైట్ చేస్తూ, హైకోర్టు మధురై బెంచ్‌లోని జస్టిస్ ఎస్ శ్రీమతి, "ఆలయం పిక్నిక్ లేదా పర్యాటక ప్రదేశం కాదు" అని అన్నారు. హిందువులు తమ మతంలో ఇతరులు ఎవరు జోక్యం చేసుకోకుండా ఆచరించే ప్రాథమిక హక్కును ఈ తీర్పు నొక్కి చెప్పింది.

Details 

హిందూయేతరులపై ఆంక్షలు విధిస్తూ బోర్డులు ఏర్పాటు

డిండిగల్ జిల్లాలోని పళనిలో ఉన్న అరుల్మిగు పళని దండయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప దేవాలయాలలోకి హిందువులు మాత్రమే ప్రవేశించడానికి అనుమతి కోరుతూ డి సెంథిల్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, ఇతర ప్రముఖ ప్రదేశాల్లో 'కొడిమారం' దాటి హిందూయేతరులపై ఆంక్షలు విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. హిందువేతరులు నిర్దిష్ట దేవతను దర్శించుకోవాలనుకుంటే, వారు హిందూమతంపై తమ విశ్వాసాన్ని,ఆలయ ఆచారాలకు కట్టుబడి ఉండేందుకు సుముఖతను ధృవీకరిస్తూ తప్పనిసరిగా ఒక బాధ్యతను అందించాలని కూడా పేర్కొంది.

Details 

హిందువేతరుల నుండి హామీ 

"హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కాని వారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించింది. ఎవరైనా హిందువేతరులు ఆలయంలో ఒక నిర్దిష్ట దేవతను దర్శించుకుంటానని క్లెయిమ్ చేస్తే, ప్రతివాదులు ఆ హిందువేతరుల నుండి హామీని పొందాలి. దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, అభ్యాసాలను అనుసరిస్తాను అలాగే ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటానని అప్పుడే అటువంటి బాధ్యతపై హిందువేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు, "అని కోర్టు తీర్పు చెప్పింది. ఆలయ నిర్వాహకులు ఆచారాలు, పద్ధతులు, ఆగమాలను ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. మత సామరస్యం,శాంతిని నిర్ధారించడానికి అన్ని హిందూ దేవాలయాలకు ఆదేశాన్ని వర్తింపజేయాలని నొక్కి చెబుతూ, పళని ఆలయానికి ఆర్డర్‌ను పరిమితం చేయాలన్న ప్రతివాదుల అభ్యర్థనను ఇది తిరస్కరించింది.