kalvakuntla Kavitha: కవిత ఆందోళనతో కామారెడ్డిలో టెన్షన్… రైలు పట్టాలపై నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో కమారెడ్డిలో రైలు రోకో చేపట్టారు. ఈ నిరసనలో కవితతో పాటు జాగృతి నాయకులు రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైలు సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇవ్వాలని కవిత స్పష్టం చేశారు. ట్రాక్‌పై కూర్చుని నిరసన తెలిపిన జాగృతి కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Details
17శాతం రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయం
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కవిత అరెస్ట్‌కు గురయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమని కవిత విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.