LOADING...
Kanyakumari Express: కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!
కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!

Kanyakumari Express: కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైలు ఏసీ బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. పరిస్థితిని గమనించిన ప్రయాణికులు వెంటనే గార్డుకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది నందలూరు వద్ద రైలును ఆపి పొగల కారకాలను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. అవసరమైన పనులు పూర్తి చేసిన అనంతరం రైలు మళ్లీ బయలుదేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది