Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఈ కేసులను ఫైల్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆయన పీఏ ఫిర్యాదు మేరకు మొదటి కేసు నమోదు చేశారు.
సమావేశంలో గందరగోళం సృష్టించారని, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు రెండో కేసు నమోదైంది.
గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఫిర్యాదు ప్రకారం తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలతో మూడో కేసును నమోదు చేశారు.
Details
పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై సమావేశం వివాదాస్పదంగా మారింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సంఘటన నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగింది.
ఈ సమావేశంలో వచ్చిన ఉద్రిక్తతలు మంత్రుల సమక్షంలోనే రసాభాసగా మారడంతో పోలీసుల తలపోటు పెరిగింది. ఈ ఘటనలపై వివిధ కేసులను విచారణనకు పోలీసులు తీసుకున్నారు.