
Mangaluru High Alert: మంగళూరులో హై అలర్ట్.. మర్డర్ కేసులో నిందితుడిని కత్తులతో నరికి చంపేశారు..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుహాష్ శెట్టి అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది.
ఐదుగురు వ్యక్తులు కోడవళ్లు,కత్తులతో అతనిపై దాడికి దిగారు. ఈ దారుణ ఘటన నడ్డి రోడ్డుపై చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సుహాష్ శెట్టికి కొన్ని హిందుత్వ సంస్థలతో సంబంధాలున్నట్లు సమాచారం. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా సమాచారం.
ముఖ్యంగా 2022లో చోటుచేసుకున్న మహమ్మద్ ఫాజిల్ హత్య కేసులో సుహాష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
అప్పట్లో బీజేపీ యువనేత ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా ఫాజిల్‌ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
మంగళూరులో పోలీసులు కఠిన చర్యలు
ఈ నేపథ్యంలో సుహాష్ శెట్టి హత్యకు ముందే పథకం వేసిన ప్రకటనగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున మంగళూరులో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
భారతీయ న్యాయ వ్యవస్థలోని నూతన నారిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం మంగళూరు నగరంలో నిషేధాజ్ఞలు విధించబడ్డాయి.
సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు గుమిగూడటం, ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది.