
Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మిస్ వరల్డ్ 2025 పోటీలపై ప్రభావం చూపుతున్నాయి.
హైదరాబాద్‌లో ఈ నెల 31వ తేదీ వరకూ జరగనున్న ఈ అంతర్జాతీయ సుందరీ పోటీలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్‌కు ఏర్పాటు చేయాల్సిన అధికారిక డిన్నర్‌ను కూడా రద్దు చేశారు.
ఇక ప్రతిపక్ష పార్టీలు ఈ నేపథ్యంలో పోటీల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Details
జూన్ 1న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే
దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ ప్రతికూల వాతావరణం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే బందోబస్తు చర్యలను పటిష్టంగా చేపట్టింది. మే 31 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి.
జూన్ 1న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.