
Elevated Corridors: ఇక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం.. హెచ్‌ఎండీఏకు 435.08 ఎకరాలు.. మంత్రిమండలి ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో పారడైజ్ నుండి శామీర్‌పేట, డెయిరీ ఫామ్ రోడ్ మార్గాల్లో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గురువారం మంత్రిమండలి ఈ నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కింద.. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ మార్గం (రాజీవ్ రహదారి - SH-01) లో ఒక ఎలివేటెడ్ కారిడార్. పారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ (NH-44) లో మరో ఎలివేటెడ్ కారిడార్.
వివరాలు
నిర్మాణానికి అవసరమైన భూమి:
అల్వాల్ మండలం కౌకూర్, శామీర్‌పేట మండలం సింగాయిపల్లి, తూముకుంట, కాప్రా మండలం జవహర్‌నగర్ గ్రామాలలో 435.08 ఎకరాలు. ఈ భూములు ప్రారంభంలో రక్షణశాఖ పరిధిలో ఉన్నాయి, కానీ ఇటీవల ప్రభుత్వం వాటిని మార్చింది. మొత్తం భూముల విలువ రూ.1,018.79 కోట్లు, వీటికి సమానమైన భూములను రక్షణశాఖ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కోసం ఇచ్చే అవకాసం ఉంది. పోలీసు అమరుల కుటుంబాలకు భూమి కేటాయింపు ఒడిశా (2008)లో నక్సల్స్ తో ఎదురుదాడుల్లో మరణించిన 33మంది పోలీసుల కుటుంబాలకు గతంలో కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో 2ఎకరాలు భూమి కేటాయించబడింది. అయితే ఆ భూమిలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా,ప్రభుత్వం అదే గ్రామంలో మరో ప్రాంతంలో 3.10ఎకరాలు (పార్కు,కమ్యూనిటీ హాల్ తదితరాలను కలిపి) కేటాయించింది.
వివరాలు
గోశాలకు,రైతులకు భూమి కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే గోశాలకు మొయినాబాద్ మండలం ఎంకేపల్లి ప్రాంతంలో సర్వే నంబరు 180లో 87 ఎకరాలు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం ఇచ్చింది. మొత్తం భూమి 99.14 ఎకరాలు ఉండగా, మిగిలిన భూమి రైతులకు పరిహారం, రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 9.34 ఎకరాలు కేటాయించారు. అలాగే, ఎంకేపల్లి నుంచి జేబీఐటీ వరకు రోడ్డు నిర్మాణానికి 2.20 ఎకరాలు భూమి కేటాయించబడింది.