TG Rains: తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు.. హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, వివిధ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కురిసే అవకాశముందని చెప్పారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. శుక్రవారం నాడు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ప్రాంతాలలో వర్షాలు కురిసే అంచనా ఉంది.
కర్నూల్ జిల్లా వెల్లటూరులో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం
శనివారం, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్లటూరులో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.